Balakrishna : ప్రస్తుతం ఎక్కడ చూసిన తమిళ హీరో విజయ్ నటించిన లియో చితం మేనియా నే కనిపిస్తుంది. జనాలు ఈ సినిమా టికెట్స్ కోసం మాత్రమే పోట్లాడుతున్నారు, మిగిలిన దసరా కొత్త సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తమిళ నాడు లో ఈ చిత్రానికి పోటీ వచ్చే సాహసం ఏ సినిమా కూడా చెయ్యదు. కానీ తెలుగు లో ఈ చిత్రానికి పోటీ గా నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ మరియు మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ వంటి పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి.
కానీ ఆడియన్స్ ఈ రెండు సినిమాలను పక్కన పెట్టి ‘లియో’ చిత్రాన్ని ప్రోత్సహిస్తున్నారు. ‘భగవంత్ కేసరి’ చిత్రం తో పోలిస్తే ‘లియో’ చిత్రానికి తక్కువ షోస్ ఇచ్చారు కానీ, ఫైనల్ అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ లియో చిత్రానికే ఎక్కువగా ఉన్నాయి. లియో చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది.
కానీ భగవంత్ కేసరి చిత్రానికి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం 4 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇలా ఒక తెలుగు సినిమాని తమిళ సినిమా డామినేట్ చెయ్యడం మన దురదృష్టకరం. విచిత్రం ఏమిటంటే సినిమా విడుదలకు ముందే ‘భగవంత్ కేసరి’ కి కేటాయించిన థియేటర్స్ ని ‘లియో’ చిత్రానికి షిఫ్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ముందుగా సంధ్య 70 ఎంఎం మరియు శాంతి థియేటర్స్ ని కేటాయించారు.
కేవలం సుదర్శన్ లో తప్ప, ‘భగవంత్ కేసరి‘ చిత్రానికి కనీస స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా లేవు. అదే సమయం లో ‘లియో’ చిత్రానికి టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి. అందుకే ‘లియో’ చిత్రానికి ఆ థియేటర్స్ ని కేటాయించగా, అవి రెండు నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్ అయ్యింది. సాధారణంగా టాక్ కి తగ్గట్టుగా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ లియో చిత్రానికి విడుదలకు ముందే అలా జరగడం విశేషం.