Leo Movie : ఒక తెలుగు సినిమాకి ఉన్నంత బజ్ మరియు క్రేజ్ ఇది వరకు తమిళ హీరోలలో మనం సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక్కటే చూసాం. ఆ తర్వాత కొన్ని సినిమాల వరకు సూర్య కి చూసాం. మళ్ళీ ఇన్ని రోజులకు విజయ్ కి చూస్తున్నాం. ఒకప్పుడు ఇతనిని హీరోగా తమిళ ఆడియన్స్ ఎలా చూసేవారు రా బాబు అని అనుకునేవాళ్లు మన తెలుగు ఆడియన్స్. కానీ ఇప్పుడు అదే తెలుగు ఆడియన్స్ ఆయన సినిమా టికెట్స్ కోసం యుద్దాలు చేస్తున్నారు.
‘విక్రమ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్ విజయ్ తో చేసిన ‘లియో’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది. ట్రైలర్ మరియు పాటలతో అభిమానుల్లో ఒక రేంజ్ అంచనాలను ఏర్పాటు చేసిన ఈ చిత్రం , అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
కేవలం తమిళ నాడు లో మాత్రమే కాదు , ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. అయితే రీసెంట్ దుబాయి ప్రీమియర్ షో నుండి వచ్చిన టాక్ ని చూస్తే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. దుబాయి నుండి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అట.
ఫస్ట్ హాఫ్ లో మొదటి 10 నిమిషాలు మాత్రం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నుండి టాప్ క్లాస్ టేకింగ్ అట. ఆడియన్స్ ఎవ్వరూ కూడా సీట్స్ లో కూర్చోరని, సినిమాలో వచ్చే ట్విస్టులు చూస్తే మెంటలెక్కిపోతారని అంటున్నారు. ఇక చివరి 30 నిమిషాలు అయితే సినిమాకి ఆయువు పట్టులాంటిది అని, ఆడియన్స్ కచ్చితంగా గూస్ బంప్స్ ఫీల్ అవుతారని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.