Leo movie : ఒక్కోసారి కొన్ని సినిమాలకు టాక్ సరిగా లేకపోయినా కూడా అద్భుతమైన వసూళ్లు వస్తుంటాయి. మన తెలుగులో కంటే కూడా తమిళం లో టాక్ లేకుండా ఇండస్ట్రీ హిట్ అయిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ హీరో గా నటించిన ‘లియో’ చిత్రం కూడా ఆ కోవలోకి చెందబోతుంది. తమిళం తో పాటుగా తెలుగు లో కూడా ఈ చిత్రానికి ఏ స్థాయి క్రేజ్ ఏర్పడిందో మన అందరికీ తెలిసిందే.

కానీ మితిమీరిన అంచనాలు కారణం గా ఈ సినిమాకి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం టాక్ తో సంబంధం లేని విధంగా ఉన్నాయి. ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 148 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ ఏడాది విడుదలైన ఆదిపురుష్, జవాన్ మరియు జైలర్ కంటే ఎక్కువ ఓపెనింగ్ అన్నమాట.

తమిళం తో పాటుగా తెలుగు లో కూడా అదే జోరు. తమిళనాడు లో వారం రోజుల వరకు ఈ సినిమా దూకుడు ఆగేలా కనిపించడం లేదు. తెలుగు లో కూడా పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. ఇక్కడ ఈ సినిమాకి రెండవ రోజు నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని అంటున్నారు. నైజాం, వైజాగ్ ఇలా ప్రధాన సిటీస్ లో అయితే లియో చిత్రం ‘భగవంత్ కేసరి‘ ని, అలాగే నిన్న విడుదలైన రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాలను డామినేట్ చేసింది.

వచ్చే వారం మంగళవారం వరకు ఇదే రేంజ్ ఊపు ని కొనసాగిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. యూత్ ఆడియన్స్ ‘లియో’ చిత్రం టాక్ ని అసలు చూడడం లేదని, కేవలం హైప్ మీద చూసేస్తున్నారు అంటూ ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండవ రోజు ఈ చిత్రానికి దాదాపుగా 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందని అంటున్నారు, ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.