పెళ్లికి ముందు నుంచే వరుణ్ తేజ్ ఇంట్లోనే ఉంటున్న లావణ్య.. ప్రూఫ్ ఇదే..

- Advertisement -

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అనూహ్యంగా తమ ప్రేమను బయటపెట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్‌లో వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా గ్రాండ్ గా జరగనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. ఇక ఈ మధ్యనే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి మనీష్ మల్హోత్రా హైదరాబాద్ స్టోర్ కి వెళ్లి పెళ్లి బట్టలు షాపింగ్ కూడా చేశారు.

ఇక ఇప్పుడు పెళ్లికి ముందే కాబోయే కోడలుగా లావణ్య ఈరోజు వరుణ్ తేజ్ ఫ్యామిలీతో కలిసి గణేష్ పండుగ జరుపుకుంది. వారి గణేష్ పూజ ఫోటోను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లావణ్య స్టూల్‌పై కూర్చున్న క్రమంలో వరుణ్ తేజ్ ఆమె వెనుక నిలబడ్డాడు. ఇక వారి పక్కనే తన భార్య కూర్చుని ఉండగా నాగబాబు కూడా అలాగే నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయితే ఈ ఫ్రేమ్ లో వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక మిస్ అయింది.

బహుశా ఆమె ఇక్కడ లేదేమో అని అంటున్నారు. లావణ్య, వరుణ్ తేజ్ త్వరలో అంటే నవంబర్ నెలలో ఇటలీలో పెళ్లి చేసుకోనున్నారు. ఏడేళ్లకు పైగా డేటింగ్‌లో ఉన్న వీరు ఈ ఏడాది మొదట్లోనే తమ లవ్ గుయించి ప్రకటించడమే కాదు ఏకంగా నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఈ మధ్యనే గాండీవధారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here