అందాల రాక్షసి చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. లావణ్య త్రిపాఠీ నటించింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఈ మధ్య పులి మేక అనే వెబ్ సిరీస్‌తో జీఫై లో ప్రేక్షకులను అలరించింది. లావణ్య త్రిపాఠి తండ్రి ఓ లాయర్ కాగా తల్లి టీచర్. ఆమె అక్క కమిషనర్. ఆమెకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. డెహ్రాడూన్ లో స్కూలింగ్ పూర్తి చేశాక ముంబైలోని రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది లావణ్య.

ఇక మరి కొద్ది రోజుల్లోనే లావణ్య త్రిపాఠి మెగా కుటుంబంలో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్యగా మెగా ఫ్యామిలీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయింది. దీంతో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ మెగా ఫ్యామిలీ మెంబర్స్, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది లావణ్య త్రిపాఠి. అయితే ఈమధ్య లావణ్య త్రిపాఠికి ఒక వ్యాధి ఉందంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇక ఆ విషయాన్ని లావణ్య త్రిపాఠి స్వయంగా చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

అయితే సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు అనేక వ్యాధుల బారిన పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సమంతా మయోసిటీస్ అనే వ్యాధికి గురై ఎలా అయిపోయిందో మనందరం చూస్తున్నాం. అలాగే లావణ్య త్రిపాటికి కూడా ఒక వ్యాధి ఉందంట. ఇన్‌స్టాగ్రామ్ లో తన అభిమానులతో లావణ్య ఈ విషయం చెప్పుకొచ్చింది. నేను చాలా ధైర్యంగా ఉంటాను. కానీ ఇటీవల కొన్ని వస్తువులను లేదా ఆకారాలను చూస్తే తెలియకుండా చాలా భయపడుతోందిట. ఈ విషయం పైన డాక్టర్‌ని సంప్రదించినప్పుడు నాకు ట్రీఫోఫోబియా ఉంది అని చెప్పుకొచ్చారుట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో లావణ్య స్వయంగా బయటపెట్టింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వ్యాధిని వరుణ్ తేజ్ ఎలా ఎదుర్కొంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.