Lavanya Tripathi : ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా ఉన్న కపుల్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి. ఎంతో మిస్తీరియస్ గా మెయిన్టైన్ చేసిన వీళ్ళ లవ్ స్టోరీ ఎంగేజ్మెంట్ తో అందరికీ తెలిసి. అప్పటినుంచి ఏదో ఒక రకంగా ఈ కపుల్ వార్తల్లో వైరల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న ఈ హీరోయిన్ కెరియర్ పై కూడా సోషల్ మీడియాలో బాగా డిస్కషన్ జరుగుతుంది.
గత కొన్ని సంవత్సరాలుగా రహస్య ప్రేమాయణం నడుపుతున్న లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ప్రేమ వ్యవహారం పై ఇరు కుటుంబాల సభ్యులు తమ ఆమోదాన్ని తెలియజేశారు. అయితే మెగా ఇంటికి కోడలు కావడానికి మాత్రం లావణ్య కు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటించడం. పై తమకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో బోల్డ్ సీన్స్ లో నటించకూడదు అని కండిషన్ పెట్టారట.
అయితే లావణ్య మాత్రం తన కెరియర్ మరియు తన ఫ్యామిలీ లైఫ్ రెండిటికి మధ్య పోస్టు రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. పెళ్లి తర్వాత లావణ్య పూర్తిగా తన సినీ కెరియర్ను పక్కన పెట్టి తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ తో కొత్త కెరీర్ ను ప్రారంభించనుంది. లావణ్య ఎన్నో సందర్భాలలో తనకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టమని పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తాను ఒక మంచి డాన్స్ స్కూల్ నిర్వహించాలి అని నిర్ణయం తీసుకుంది అన్న వార్త ఇప్పుడు నెట్ లో వైరల్ అయింది.
ఇంతకుముందు అగ్ర హీరోయిన్లుగా వెలిగి.. తమ కోస్టార్స్ ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కుటుంబమే ముఖ్యమని కెరీర్ను పక్కనపెట్టిన అమల మరియు నమ్రత బాటలోని లావణ్య నడవడంపై కొందరు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొందరు మెగా ఫ్యామిలీలో నియమాలన్నీ కోడళ్ళకేనా …కూతుర్లకు లేవా అని ప్రశ్నిస్తున్నారు.