Varun Tej : రీసెంట్ గానే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఎంత ఘనంగా జరిగిందో మన అందరం చూస్తూనే ఉన్నాం. సుమారుగా నాలుగేళ్ల నుండి ప్రేమించుకున్న ఈ ఇద్దరు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. రీసెంట్ గానే నాగబాబు నివాసం లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా జరిగింది. లావణ్య త్రిపాఠి గత కొంత కాలం నుండి వరుణ్ తేజ్ ఇంట్లోనే ఉంటుంది. వినాయక చవితి పూజలు కూడా ఆమె వరుణ్ తేజ్ ఇంట్లోనే చేసుకుంది.
ఇక మెగా ఫ్యామిలీ లో అందరితో లావణ్య త్రిపాఠి బాగా కలిసిపోయింది. నవంబర్ 1 వ తేదీన వీళ్లిద్దరి పెళ్లి స్పెయిన్ లో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మరియు కొంత మంది స్నేహితుల సమక్షం లో ఘనంగా జరగబోతుంది. ప్రైవసీ ని ఇష్టపడే వరుణ్ తేజ్, హైదరాబాద్ లో ఉంటే ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్లంతా వస్తారని ఇలా దేశం కానీ దేశంలో పెళ్లి చేసుకుంటున్నట్టు సమాచారం.
ఇదంతా పక్కన పెడితే పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్లిళ్లు చాలా లీగల్ గా పకడ్బందీగా జరుగుతాయి. రేపు ఏదైనా సమస్య వచ్చి విడిపోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు, పెళ్లి కూతురుకి దక్కాల్సిన భరణం ఏమిటి..?, ఒకవేళ విడిపోవాలి అనుకుంటే అమ్మాయి/ అబ్బాయికి సంబంధించిన డిమాండ్స్ లో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈమధ్య పెళ్లిళ్లు అన్ని ఇలాగే జరుగుతున్నాయి. సమంత మరియు నాగ చైతన్య పెళ్లి, అలాగే నయనతార మరియు సతీష్ విగ్నేష్ పెళ్లిళ్లు కూడా ఇలాగే జరిగాయి.
ఇదే బాటలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా జరగబోతుంది అట. రెండేళ్లు ప్రేమించుకొని, నాలుగేళ్లు ఒకే ఇంట్లో డేటింగ్ చేసుకున్న తర్వాత ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకొని ఉన్నారు కాబట్టే వరుణ్ తేజ్ – ల్వాన్య త్రిపాఠిలు సంప్రదాయబద్దం గా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వీళ్ళ దాంపత్య జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేదానిపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని అంటున్నారు ఫ్యాన్స్.