Lavanya Tripathi : అవును ప్రస్తుతం ఇదే న్యూస్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది . లావణ్య, వరుణ్ అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాడన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది.
నిజానికి ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే వరుణ్, లావణ్య ఇద్దరు ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకున్నారట. భవిష్యతులో ఏదైనా గొడవ వచ్చినా.. నేను అడిగిన నువ్వు నాకు విడాకులు ఇవ్వకూడదు.. నువ్వు అడిగిన నేను నీకు విడాకులు ఇవ్వకూడదంటూ లావణ్య మన వరుణ్ దగ్గర ప్రామిస్ చేయించుకుందట.
అంతేకాదు లావణ్య మాటలకు ఫిదా అయిపోయాడు వరుణ్. ప్రస్తుతానికి అయితే ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉందో మనకు తెలిసిందే. ఇక ఈ జంట విడాకులు తీసుకుంటారు అని ఎవరెవరో జ్యోతిష్కులు చెప్తున్నా అదంతా ఫేక్ అంటున్నారు అభిమానులు. కాగా మిస్టర్ సినిమాతో వీళ్ల పరిచయం మొదలైంది. ఆ తరువాత అది ప్రేమగా మారి.. ఇప్పుడు భార్య భర్తలుగా మారే వరకు వెళ్లింది..!