Lavanya Tripathi : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు లావణ్య త్రిపాఠి. అందం తో పాటుగా, చక్కటి అభినయం కనబర్చే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఆమె ఒకరు. ‘అందాల రాక్షసి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన ఈమె తొలిసినిమాతోనే ప్రేక్షకులను కట్టిపారేసింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పాటుగా లావణ్య త్రిపాఠి కి మంచి పేరుని, అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.

అయితే చేతికి వచ్చిన ప్రతీ అవకాశం ని అందుకోకుండా, కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. రీసెంట్ గానే ఆమె టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ రీసెంట్ గానే డిస్నీ + హాట్ స్టార్ లో అప్లోడ్ అయ్యింది.

ఈ సిరీస్ కి అనుకున్న స్థాయి రెస్పాన్స్ అయితే రాలేదు కానీ లావణ్య త్రిపాఠి కి మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ సిరీస్ విడుదలకు ముందు ఆమె అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో యాంకర్ ఆమె గురించి ట్రెండ్ అయిన ఒక పాపులర్ మీమ్ ని చూపిస్తూ ‘అప్పట్లో అల్లు అరవింద్ గారు ఇక్కడే ఎవరో ఒక తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అన్నారు..ఆయన చెప్పినట్టుగానే మీరు వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అల్లు అర్జున్ కొన్ని రోజుల తర్వాత దీని గురించి ప్రస్తావిస్తూ మా నాన్న గొప్ప విజనరీ అని అంటాడు..ఈ మీమ్ మీ వరకు వచ్చిందా’ అని అడుగుతాడు.

అప్పుడు లావణ్య త్రిపాఠి దానికి సమాధానం చెప్తూ ‘ఈ మీమ్ నా దగ్గర వరకు వచ్చింది. వాస్తవానికి అప్పట్లో నేను వరుణ్ తేజ్ తో లవ్ లో ఉన్నాను, ఈ విషయం అల్లు అరవింద్ గారికి తెలియదు, అయినా కూడా ఆయన తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకో అనేసరికి నేను షాక్ కి గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.