Lavanya Tripathi : మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారిక కొణిదెల ఇండస్ట్రీ లో ఎంత ఫేమస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఈమె చైతన్య అనే వ్యక్తిని పెళ్ళాడి సినిమాలకు గుడ్బై చెప్పింది. వీళ్లిద్దరి పెళ్లిని నాగబాబు రాజస్థాన్ లో ఎంత అంగరంగ వైభవంగా జరిపారో మనమంతా చూసాము. ఇప్పటికే ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

అయితే ఈ జంట రీసెంట్ గానే విడాకులు తీసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అప్పటి నుండి నిహారిక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి, నిర్మాతగా కూడా వ్యవహరించిన నిహారిక ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఇదంతా పక్కన పెడితే నిహారిక కి కాబొయ్యే వదిన లావణ్య త్రిపాఠి రీసెంట్ గా ఫోన్ చేసి బాగా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది.

నిహారిక మరియు లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. ఒకే జిమ్ లో ప్రతీ రోజు వర్కౌట్స్ చేస్తూ అలా వీళ్లిద్దరు స్నేహితులు అయ్యారు. వీళ్లిద్దరి స్నేహం కారణంగానే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఇప్పుడు వీళ్లిద్దరు నవంబర్ 1 వ తేదీన స్పెయిన్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉండే నిహారిక ఈమధ్య కాలం లో ఎక్కువ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పొట్టి బట్టలు వేసుకుంటూ, కుర్రాళ్లను టెంప్ట్ చేసే విధమైన ఫోటోలను అప్లోడ్ చేస్తుంది.

ఇదంతా చూసిన లావణ్య త్రిపాఠి వెంటనే నిహారిక కి ఫోన్ చేసి, ఏంటి ఈ పిచ్చి వేషాలు, ఇంట్లో మామయ్య ఏమి అనుకుంటాడో అని కూడా ఆలోచించవా, ఆయన ఎన్నో సార్లు నీ గురించి బాధపడడం చూసాను అంటూ గంటసేపటి వరకు బలంగా క్లాస్ పీకింది అట. కనీసం ఇప్పటి నుండి అయినా నిహారిక ఇంస్టాగ్రామ్ లో అలాంటి ఫోటోలు పెట్టడం ఆపుతుందో లేదో చూడాలి.