Bigg Boss 8 Telugu లోకి రాజ్ తరుణ్ తో పాటు లావణ్య..? ప్లానింగ్ ఊహించని రేంజ్ లో ఉందిగా!

- Advertisement -

Bigg Boss 8 Telugu  : గత కొంతకాలం నుండి హీరో రాజ్ తరుణ్ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడా మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇది ఆయన సినిమా సూపర్ హిట్ అవ్వడం లో ట్రెండ్ అవుతున్నది కాదు, ఆయన మాజీ ప్రేయసి లావణ్య మీడియా ముందుకి వచ్చి చేస్తున్న రచ్చ కారణంగా. రోజురోజుకి ఈ సంఘటన వివిధ మలుపులను తిప్పుకుంటూ ముందుకు పొత్తు ఉంది. అయితే రాజ్ తరుణ్ ట్రెండింగ్ లో ఉండడంతో ఆయన నిర్మాతలు ఈ హైప్ ని వాడుకుందాం అనే ఆలోచనతో వారం గ్యాప్ లో రాజ్ తరుణ్ రెండు కొత్త సినిమాలను విడుదల చేసారు. ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. థియేట్రికల్ గా ఇది వర్కౌట్ అవ్వకపోయినప్పటికీ, బుల్లితెర మీద మాత్రం వర్కౌట్ అవుతుందని బిగ్ బాస్ యహమణ్యం బలంగా నమ్ముతుంది.

Bigg Boss 8 Telugu
Bigg Boss 8 Telugu

హిందీ లో గత ఏడాది టెలికాస్ట్ అయినా బిగ్ బాస్ సీజన్ లో ఇలాంటి ప్రయోగమే చేసారు. విడిపోయిన జంటని షో లోకి తీసుకొని రావడం, వాళ్ళ మధ్య జరిగే గొడవలు మరియు ఇతర సంఘటనలు ఆడియన్స్ లో అమితాసక్తిని రేపి గ్రాండ్ హిట్ అయ్యేలా చేసింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లో కూడా ఇదే పని చేయబోతున్నారని టాక్. ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం రాజ్ తరుణ్ ని సంప్రదించింది. ఆయన ఈ షో లో పాల్గొనేందుకు అంగీకారం కూడా తెలిపాడు. సోషల్ మీడియా లో వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే లావణ్య ని కూడా బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించిందట. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Raj Tarun Issue: Lavanya Attempted Suicide

- Advertisement -

బయట ఉన్నప్పుడే లావణ్య వల్ల రాజ్ తరుణ్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, ఆమె వల్ల మానసికంగా ఎంత టార్చర్ ని అనుభవిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మూడు నెలల పాటు లావణ్య , రాజ్ తరుణ్ ఒకే చోట ఉంటే హౌస్ లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడాలి. ఇకపోతే ఈ సీజన్ సెప్టెంబర్ 1 వ తేదీ నుండి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ ప్రారంభం కానుంది. రీసెంట్ గానే ఈ సీజన్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు, ఆగస్టు 15 న ట్రైలర్ తో పాటుగా, బిగ్ బాస్ టెలికాస్ట్ తేదీ కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here