ప్రస్తుతం మెగా డాటర్ Niharika విడాకుల విషయం మారుమోగుతుంది..కానీ నిహారిక మాత్రం విడాకులు వచ్చాక తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంది.అలాగే ఈ మధ్యకాలంలో శ్రీజ పెద్ద కూతురు బర్త్డే లో కూడా చాలానే ఎంజాయ్ చేసిన ఫొటోస్ నెట్టింట చక్కెర్లు కొట్టడంతో అటు విడాకులు ఇచ్చి అందర్నీ బాధ పెట్టి ఇటు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా.. పెళ్లి అంటే తమాషానా అంటూ నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. మరోవైపు సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది.. నిహారిక విడాకులు లావణ్యను ఇబ్బందుల్లో పడేసింది అంటూ వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి..

ఆడపిల్ల అయినా సరే పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళేటప్పుడు అత్తింటి బ్యాగ్రౌండ్ అన్ని చూసుకొని వెళుతుంది. ఇక అది మామూలు జనం నుండి సెలబ్రెటీల వరకు అందరికీ వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది. ఇలాంటి నేపథ్యంలోనే వారి ఇంట్లోనే ఆడబిడ్డ విడాకులు తీసుకుంది. ఈ కారణంతో లావణ్య త్రిపాఠి నిహారిక విడాకుల వల్ల ఆలోచనలో పడిందట.. ఎంతో హ్యాపీగా పెళ్లి చేసుకోవాలనుకున్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లకి నిహారిక విడాకులు కాస్త మైనస్ అయ్యాయని తెలుస్తోంది. నిహారిక విడాకులు తీసుకోవడంతో లావణ్య త్రిపాటి మెగా ఇంటికి వెళ్ళాక తన జీవితం ఎలా ఉంటుందో అని భయపడుతుందని ఓ వార్త షికారు చేస్తుంది..

అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్స్ అయితే పెళ్లయ్యాక మీ జీవితం మీది.. ఎలాగూ అత్తమామలతో కలిసి ఉండరు కదా.. అలాంటప్పుడు మీరు కోరుకున్న జీవితాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి.. మీ లైఫ్ మీరు బాగా ఎంజాయ్ చేయండి..అంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు.. ఇక లావణ్య ఫ్యామిలి కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. మరి లావణ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..