Rakul Preet Singh గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుస సినిమాల్లో నటించి తనకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అందరు అగ్ర హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోయిన్ గా రాజ్య మేలేసింది. బోల్డ్ రోల్స్ ని కూడా అవలీలగా చేసి బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో బాలీవుడ్ జనాలను బెదరగొట్టేసింది.
త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ స్టార్ హీరోస్ అల్లు అర్జున్,తారక్, చరణ్ పై సంచలన కామెంట్స్ చేసింది. వాళ్ల కారణంగా ఒక మంచి సినిమాను వదులుకోవాల్సి వచ్చిందంటూ పరోక్షంగా కౌంటర్ వేసింది.
బాలీవుడ్లో ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించాల్సింది. తెలుగులో సరైనోడు, ధ్రువ, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలలో నటిస్తున్న టైం లో ఈ ఆఫర్ రావడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఈ సినిమాను వదులుకుందట. ఒకవేళ ఆ సినిమా చేసుంటే బాలీవుడ్లో ఇంకా పెద్ద స్థానానికి వెళ్లే ఉండే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.