Prashanth Varma : హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జాక్ పాట్ ఆఫర్ కొట్టేశాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ వర్మ తన తర్వాత సినిమాను బాలయ్య బాబుతో కమిట్ అయ్యాడట. ఈ వార్త ఇప్పుడు బాక్సాఫీసును షేక్ చేస్తుంది. బాలయ్య లాంటి స్టార్ హీరో ప్రశాంత్ వర్మకు ఆఫర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ హనుమాన్ సినిమా చూసిన బాలయ్యకు ఆయన దర్శకత్వ ప్రతిభ తెగ నచ్చేసిందట. దీంతో బాలయ్య ఆయనకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారట.

హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రాన్ని పూర్తి చేయడానికి సమయం కేటాయిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా కన్నా ముందే బాలయ్యతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఇది నందమూరి అభిమానులకి నచ్చే విధంగా ఉండబోతుందట. అంతేకాదు బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బైరవద్వీపం, ఆదిత్య 369లాంటి జానర్లో ఈ సినిమాను రూపొందించబోతున్నారట.

ఆల్రెడీ ప్రశాంత్ వర్మ బాలయ్య హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ కి సంబంధించి డైరెక్ట్ చేశారు. ఆ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావాల్సిందే. గుంటూరు కారంకి ఒకరోజు ముందు అనగా శుక్రవారం విడుదలైన హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ రాబట్ట లేకపోయినా సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అనడంలో సందేహమే లేదు. హనుమాన్ అన్నిభాషల్లో మొదటిరోజు దాదాపు రూ.8కోట్లు వసూలు చేసింది. కేవలం తెలుగులో రూ.5.50 కోట్లు వసూళ్లు కాగా.. హిందీలో రూ.2 కోట్లు.. మిగిలిన భాషల నుండి రూ.0.06 కోట్లు వసూలైంది.