Rajamouli : ఆ స్టార్ హీరోయిన్ తో రాజమౌళి పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా..? అందుకే పిల్లల్ని కనాలి అనుకోలేదా!

- Advertisement -

Rajamouli : ఒక చిన్న సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన రాజమౌళి ఆ తర్వాత సినిమాల డైరెక్టర్ గా మారి, స్టూడెంట్ నెంబర్ 1 అనే చిత్రం తో సినీ ప్రస్థానం మొదలు పెట్టి, నేడు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం గర్వపడేలా చేసి తిరుగులేని నెంబర్ 1 సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ బ్రాండ్ ఏ హీరో కి కూడా లేదు.

అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న రాజమౌళి తన తదుపరి చిత్రం మహేష్ బాబు తో చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. #RRR చిత్రం తో హాలీవుడ్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టిన రాజమౌళి, ఈ సినిమాతో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కూడా కొల్లగొడుతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే రాజమౌళి కి తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సమయం లోనే రమా గారితో పెళ్ళైన సంగతి అందరికీ తెలిసిందే.

రామా గారికి అంతకు ముందే ఒక పెళ్లి జరిగి, విడాకులు కూడా జరిగింది. ఆమెకి కార్తికేయ అనే కుమారుడు అప్పటికే జన్మించి ఉన్నాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చెయ్యడం, ఆ సమయం లోనే రాజమౌళి ఆమెతో ప్రేమలో పడడం వంటివి జరిగాయి. అయితే అదంతా పక్కన పెడితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పెద్ద రచయితా, అలాగే ఆయన అన్నయ్య కీరవాణి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజమౌళి కి అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చి ఒక ఊపు ఊపుతున్న యంగ్ స్టార్ హీరోయిన్ తో పెళ్లి చెయ్యాలని విజయేంద్ర ప్రసాద్ చాలా కోరుకున్నాడట.

- Advertisement -

కీరవాణి ద్వారా ఆ హీరోయిన్ తో చర్చలు కూడా జరపాలని చూశాడట. కానీ ఆ హీరోయిన్ ని అడిగే ముందు రాజమౌళి కి ఇష్టం ఉందో లేదో తెలుసుకుందాం అని ఆయన్ని అడగగా,తన మనసులో అప్పటికే రమా ఉందని, చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడట. అలా ఆ స్టార్ హీరోయిన్ తో రాజమౌళి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక రమా తో పెళ్లి జరిగిన తర్వాత రాజమౌళి కి కార్తికేయ తో ఒక అద్భుతమైన బాండింగ్ ఏర్పడింది, ఆమెతో పిల్లల్ని కంటే ఎక్కడ కార్తికేయ పట్ల పక్షపాతం చూపిస్తాను ఏమో అని భయపడి పిల్లల్ని కనే ఆలోచన పక్కన పెట్టాడట రాజమౌళి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here