Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు అనుకున్న దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో ఈ సీజన్ కి వచ్చినంత ఏ సీజన్ లో కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ రేంజ్ కంటెంట్ ని కంటెస్టెంట్స్ ఇచ్చారు. చివరికి ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా సామాన్య రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలబడగా, అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు.
అయితే గ్రాండ్ ఫినాలే రోజు సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఇప్పుడు కలకలం రేపింది. కంటెస్టెంట్స్ కార్ల మీద దాడులు చెయ్యడం, వారి కుటుంబాలను భయబ్రాంతులకు గురి చెయ్యడం వంటి వాటిపై పోలీసులు కేసు కూడా నమోదు చేసారు. దీనిపై చాలా కఠినతరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
అయితే ఈ సీజన్ పూర్తి అయినా వెంటనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కి సంబంధించిన సరికొత్త రెండవ సీజన్ ని ప్రారంభించబోతున్నట్టు గా గత కొంత కాలం నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల నుండి ఈ సీజన్ ప్రారంభం కాబోతుందని టాక్. అయితే పోలీసులు మొన్న జరిగిన అవాంఛనీయ సంఘటనలను పరిగణలోకి తీసుకొని, వచ్చే సీజన్ పై కేసు వేస్తూ ఆంక్షలు విధించారట.
దీంతో డిసెంబర్ 25 వ తారీఖున బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న మీటింగ్ ని వాయిదా వేశారు. పరిస్థితి చూస్తూ ఉంటే ఇక ఓటీటీ వెర్షన్ ఉండకపోవచ్చు అనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. కేసు సీరియస్ అయితే అసలు బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు లో పూర్తిగా ఆగిపోయ్యే ప్రమాదం కూడా ఉంది. మరి ఏమి జరగబోతుణ్హదో తెలియాలంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.