Nagarjuna : చాలా కాలం నుండి అక్కినేని ఫ్యామిలీ టాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతూ ఉంది. రీసెంట్ సమయం లో వచ్చిన సినిమాలన్నీ కనీసం పది కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయాయి. కానీ రీసెంట్ గా విడుదలైన నాగచైతన్య ‘దూత’ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ రావడం తో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా తర్వాత అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న చిత్రం ‘నా సామి రంగ’.

విజయ్ బెన్నీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ మాస్ మసాలా మూవీ ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అని అనిపించుకుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో మరింత జోష్ ని నింపింది.

అదేమిటి అంటే ఈ సినిమాలో టైటిల్ సాంగ్ నాగ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉంటుందట. ఆస్కార్ విజేతలు కీరవాణి స్వరపర్చిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించాడు. ఈ పాట వెండితెర మీద కూడా అదిరిపోతుందట. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ లో తెరకెక్కుతున్న ఈ సాంగ్ లో నాగార్జున తో పాటుగా అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కూడా చిందులు వెయ్యబోతున్నారు.

సుమారుగా మూడు కోట్ల రూపాయిల ఖర్చు తో సుమారుగా 300 మంది డ్యాన్సర్లతో చిత్రీకరణ మొదలు పెట్టారట. ఇంత హైప్ లేపిన ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా లో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమె క్యారక్టర్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అట.
