Venkatesh : ఆ హీరోయిన్ కారణంగా తండ్రితో తిట్లు తిన్న వెంకటేశ్.. చావంచుల దాకా వెళ్లొచ్చాడు

- Advertisement -

Venkatesh : సినిమా అనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వెండితెరపై చూపడం సహజం. అలాగే తెరపై కనిపించే వారి జీవితాల్లో కూడా లేకున్న ఉన్నట్లు రూమర్లు రావడం సర్వ సాధారణం. ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో హీరోయిన్స్ అయినా ఇలాంటి గాసిప్స్ కి బలి అవ్వక తప్పదు. ఈ విషయం సామాన్యులకు కూడా తెలిసిందే. కానీ ఇప్పటి వరకు రూమర్లకు ఆమడ దూరంలో ఉన్నాడనుకున్న స్టార్ హీరో కూడా వీటికి అతీతుడేమీ కాదని తెలుస్తోంది. ఆయన అప్పట్లోనే అలాంటి గాసిప్స్ భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అనుకున్నాడట. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేష్ చాలా మంచి మంచి సినిమాల్లో నటించి తన అభిమానులను అలరించాడు. మరీ ముఖ్యంగా ఆయన సౌందర్య.. వెంకటేష్ కాంబోలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. వారి కాంబో అంటే అభిమానులకి తెగ ఇష్టం. వీళ్ల జంటను చూడడానికే ప్రత్యేకంగా థియేటర్లకు వస్తుండేవారు అభిమానులు. అంతగా వెండితెరపై వారి మధ్య కెమిస్ట్రీ పండేది. ఈ క్రమంలోనే వీళ్ళ మధ్య ఏదో అఫైర్ ఉందంటూ ప్రచారం జరిగింది.

Venkatesh
Venkatesh

అంతేకాదు చాలామంది వీళ్ల గురించి చాలా తప్పు తప్పుగా మాట్లాడుకున్నారు. ఆ మాట వెంకటేశ్ తండ్రి డాక్టర్ డి రామానాయుడు చెవిలో పడిందట. వెంటనే వెంకటేష్ వీళ్ళిద్దరిని పిలిపించి క్లాస్ పీకారట. దీంతో కొడుకును నమ్మకుండా బయటి వాళ్ల మాటలు నమ్మి అవమానించినందకు చాలా హర్ట్ అయ్యాడట వెంకటేశ్. దీంత కోపం లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. కానీ అలా సూసైడ్ చేసుకుంటే తాను నిజంగానే తప్పు చేసినట్లు అవుతుందని ఆ ఆలోచన విరమించుకొని సౌందర్య తనకు సిస్టర్ తో సమానమని.. తనకు ఆమెకు ఏ సంబంధం లేదని నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డాడట. ఆ తర్వాత ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడుకున్న వీళ్లు పట్టించుకోలేదట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com