Samantha : పాపం సమంత టైం ఏంటి ఇంత దారుణంగా ఉంది.. ఉన్న పరువు కూడా పోయిందిగా

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆమె అభిమానులకు ఇది బిగ్ షాక్ ఎదురైంది. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీలో డమ్మీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో హీరోయిన్ సమంతకు సినిమా అవకాశాలు రావడం లేదు. సోషల్ మీడియాలో క్రేజీ ఆఫర్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా కానీ కొన్ని కొన్ని ఆఫర్స్ ఫేక్ అంటూ తర్వాత తేలిపోతున్నాయి. మరికొన్ని ఆఫర్స్ వచ్చినట్లే వచ్చి చేజారి పోతున్నాయి.

ఇటీవల సోషల్ మీడియాలో సమంత.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించే సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్లు ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీలయ్యారు. సీన్ కట్ చేస్తే ఏకంగా మేకర్సే మా సినిమాలో హీరోయిన్ సమంత కాదని తేల్చి చెప్పేశారు. ఈ వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అంతేకాదు షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో సరసన అవకాశమొచ్చిందంటూ అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేశారు. అయితే మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో అమ్మడి రేంజ్ ఢమాల్ అని పడిపోయింది.

- Advertisement -

టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్‌ మరో సినిమా చేయబోతున్నారని .. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే షారూఖ్ తో, రాజ్‌కుమార్ హిరాణీతో సమంతకి ఇదే తొలి సినిమా అయ్యేది. కానీ అది ప్రస్తుతానికి ఈ వార్త రూమర్ అని క్లారిటీ వచ్చింది. ఈ వార్తలపై దర్శకుడు రాజ్​కుమార్ హిరాణీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ కేవలం రూమర్స్ అని టీమ్​మెంబర్ ఒకరు కొట్టి పారేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here