Sreeleela : సినిమా అనేది రంగుల ప్రపంచం.. అదో మాయాలోకం.. అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, సినీ పెద్దలు స్టార్ సెలబ్రిటీస్ అందులో నెగ్గుకు రావడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ జనరేషన్ మాత్రం.. ఆ విషయాలను పెద్దగా పట్టించుకోరు. క్రేజ్, పబ్లిసిటీ, పాపులారిటీ చూసుకుని.. మేమే తోపులం అంటూ విర్రవీగుతుంటారు.

వన్స్ నాలుగు సినిమాలు ఫ్లాపులు పడ్డాయా.. ఇక అంతే.. అడ్రస్ లేకుండా పోతారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఓ అడుగు దూరంలోనే ఉంది హీరోయిన్ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుంది. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తూ ఉండడమే ఇందుకు కారణం.

తాజాగా శ్రీలీల నటించిన గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేసినప్పటికీ .. నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతకుముందు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ సినిమాలు ఆమె కెరీర్ కు భారీ దెబ్బకొట్టాయి. దీంతో శ్రీ లీల సినిమాలకు బ్రేక్ చెప్పబోతుందంటూ వార్తలు వినిపించాయి. ఫైనల్లీ అదే నిజమైంది శ్రీలీల సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పేస్తుంది. తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కి కథ వినకుండానే వెనక్కి తిరిగి పంపించేస్తుందట. దీంతో శ్రీ లీల బ్రేక్ తీసుకుంటుందన్న వార్త నిజం అయిపోయింది.