Samantha : దారుణంగా సమంత పరిస్థితి.. రూ.500కోసం హోటల్లో అలాంటి పనులు ?

- Advertisement -


Samantha : ఈ మధ్యకాలంలో సమంత పై సోషల్ మీడియాలో జరిగినంత ట్రోలింగ్ మరే ఇతర హీరోయిన్ పై జరగలేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో.. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె పేరు టాప్ హీరోయిన్ లిస్టులోనే ఉంది. ఏమాయ చేశావే సినిమా తర్వాత ఆమెను ఓ కుందనపు బొమ్మగా.. దేవతలా..ఇండస్ట్రీకి దొరికిన ఓ మహారాణి లా ట్రీట్ చేశారు. సమంత వస్తుందంటే చాలు అక్కడ అరుపులు.. కేకలతో నానా హంగామా ఉండేది. ఒక స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోయింది సమంత.

సీన్ కట్ చేస్తే నాగచైతన్యతో డివర్స్.. ఆ తర్వాత అమ్మడిని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఆమెపై ట్రోలింగ్ ఉధృతంగా చేశారు. అయినా తాను అవేవీ పెద్దగా పట్టించుకోకుండా తన లైఫ్ తనది అంటూ ముందుకు వెళుతుంది. ఇటీవల సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరియర్ స్టార్టింగ్ లో ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చింది. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని.. అందరి కుటుంబం లాగానే మేము ఒక రూపాయి కోసం చాలా ఆలోచించేవాళ్లమని చెప్పింది.

samantha

ఒక్క పూట అన్నం తినడానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితి నుంచి పైకి ఎదిగానని.. మా తల్లిదండ్రులు కూడా బాగా చదువుకోవాలి జాబ్ చేయాలి అని అందరిలాగే చెప్పేవారిని వివరించింది. కానీ స్కూల్ వరకు బాగానే సాగిన చదువు కాలేజీ తర్వాత ఫైనాన్షియల్ గా డబ్బులు పెట్టే స్థాయి లేక ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పింది. ఆ టైంలో నాకు చేతనైన సహాయం కుటుంబానికి చేయాలని భావించి చేతికి వచ్చిన పనులు చేశానంది. ఈ క్రమంలోనే ఓ హోటల్లో 500 రూపాయలకు యాంకరింగ్ చేశానని.. అదే నా మొదటి సంపాదన అని ఇప్పటికీ నా లైఫ్ లో ఆ రోజులు మర్చిపోలేదంటూ చెప్పుకు వచ్చింది”. దీంతో సమంత పై చాలా జాలి చూపిస్తున్నారు జనాలు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here