Nagachaithanya : సోషల్ మీడియాలో ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీస్‌ని పొగడడం కన్నా తిట్టడం.. ట్రోల్స్ చేయడం కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరోలను సైతం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న వాళ్లను ట్రోల్ చేయడం మామూలే అంటూ జనాలు కూడా ట్రోలింగ్ విషయాలను చాలా లైట్‌గా తీసుకుంటున్నారు.
ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కొంతమంది క్రియేట్ చేసిన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగులో బిజీగా ఉన్న నాగచైతన్య ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏ కాదు తన పర్సనల్ విషయాలను కూడా ఓపెన్ గా చెప్పుకు వచ్చారు. మరి ముఖ్యంగా తన ఫేవరెట్ ఫుడ్ ఏంటో అన్న విషయం ఆయన బయటపెట్టారు.
అందరిలాగా తనకు ఫారిన్ ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పకుండా.. భారతీయ సంప్రదాయ వంటకాలు ఫుడ్ అన్నం, పప్పు, ఆవకాయ, నెయ్యి, పచ్చి పులుసు కలుపుకుని తినడం అంటే తనకు చాలా ఇష్టమట. అంతేకాకుండా మటన్ ఫ్రై, రొయ్యల ఫ్రై అందులో నంచుకోవడానికి ఉంటే నా సామి రంగా ఇక లైఫ్ కి ఏం కావాలి అంటూ చెప్పుకొచ్చారు. నాగచైతన్య చెప్పిన విషయాలు చాలా పాజిటివ్ గానే ఉన్నప్పటికీ నాగచైతన్య యాంటీ ఫ్యాన్స్ మాత్రం కావాలని ట్రోల్ చేస్తున్నారు. మీకు అవి ఉంటే చాలు.. అమ్మ, నాన్న, భార్య పిల్లలు ఎవరూ అవసరం లేదు కదా అంటూ సోషల్ మీడియాలో ఆయనను కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన పాజిటివ్ మాటలను కూడా నెటిజన్లు నెగిటివ్ గా ట్రెండ్ చేసేస్తున్నారు.