Sreeleeela : శ్రీలీల చివరి చిత్రం అదేనా.. తల్లి టార్చర్ తట్టుకోలేక సినిమాలకు దూరం!

- Advertisement -

Sreeleeela : ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. ఈమె శ్రీకాంత్ కొడుకు రోషన్ మొదటి సినిమా ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆమె చేసిన ధమాకా చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో ఏకంగా డజనుకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు సంతకం చేసింది.

అయితే ఈ సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్ తో చెయ్యాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది లో విడుదల కాబోతుంది. ఈ సంక్రాంతికి ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం విడుదల కాబోతుంది.

వీటితో పాటు చేతిలో ఉన్న పలు సినిమాల షూటింగ్స్ కూడా చివరి దశకు వచ్చేయడం తో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సిందిగా ఆమె తల్లి స్వర్ణలత శ్రీలీల పై ఒత్తిడి చేస్తుందట. కారణం ఆమెకి ఎంబీబీఎస్ పరీక్షలు దగ్గర పడడం వల్లే. ఇప్పటికే పరీక్షువులను నిర్లక్ష్యం చేస్తూ ఎక్కువగా సినిమాల మీద ఫోకస్ చేసిందని, ఇక చదువు మీద శ్రద్ద చూపమని శ్రీలీల ని టార్చర్ చెయ్యడం మొదలు పెట్టిందట.

- Advertisement -

దీంతో శ్రీలీల ఇప్పట్లో ఏ కొత్త సినిమాకి కూడా కమిట్ అయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. ఆమె ఇవ్వబోయ్యే ఈ గ్యాప్ ఆమెకి పోటీగా దూసుకొస్తున్న మృణాల్ ఠాకూర్ సరిగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈమెతో పాటు ‘ఎనిమల్’ చిత్రం లో బోల్డ్ గా నటించి కుర్రకారులో సెగ రేపిన త్రిప్తి దిమిరి కి కూడా టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ కురుస్తుంది అట. ఆమె కూడా శ్రీలీల కి ప్రత్యామ్నాయం గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here