Uday Kiran : లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తారాజువ్వలా దూసుకొచ్చారు. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిపోయారు. ప్రతి కాలేజీ అమ్మాయి బుక్కులో ఉదయ్ కిరణ్ ఫోటో ఉండేదంటే అతిశయోక్తి కాదు. న్యూస్ పేపర్ పై ఉదయ్ కిరణ్ ఫోటో పడితే చాలు కట్ చేసి బుక్స్ లో దాచుకునే వాళ్లు అమ్మాయిలు. అలాంటి ఉదయ్ కిరణ్ చేసిన చిన్న తప్పే ఆయన కెరీర్ ను పాతాళానికి నెట్టి వేసిందన్న వార్త సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.
నువ్వునేను సినిమా గుర్తుందా. ఆ సినిమాలో ఉదయ్ కిరణ్ అనిత జంటగా నటించారు. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమా టైంలోనే ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితను ప్రేమించారట. ఆమె కూడా ఆయనను ప్రేమించిందట. ఇద్దరు కొన్నాళ్ల తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ ఉదయ్ కిరణ్ ఒకానొక టైం లో అనితకు హ్యాండ్ ఇచ్చాడట. అంతేకాదు సినిమాల పరంగా టాప్ పొజిషన్లో ఉన్న ఉదయ్ ఇప్పుడే లవ్ అంటూ కమిట్ అయితే కెరీర్లో ఎదగలేనంటూ చెప్పేశాడట.
దీంతో బాధను తట్టుకోలేక అనిత కూడా అర్థం చేసుకుని ఆయనకు దూరంగానే ఉన్నారట. అలా అనిత పట్ల ఉదయ్ కిరణ్ చేసిన చిన్న తప్పే తన పాలిట శాపంగా మారింది అంటూ అప్పట్లో జనాలు చెప్పుకునేవారు. అంతేకాదు ఒకవేళ అనితను పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ ను మించిపోయే వాడని కూడా ఆయన అభిమానులు అంటున్నారు.