Sitara Gattamaneni : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వారంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కారణం ఆయన నటించిన ప్రతీ సినిమా హిట్ అవుతుండడంతో మహేష్ బాబు తన తాజా చిత్రం గుంటూరు కారం ఎప్పుడు విడుదల అవుతుందా.. ఎప్పుడు హిట్ చేయాలా అని ఎదురు చూస్తున్నారు. మహేశ్ కూడా సినిమాను త్వరగా విడుదల చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన తన కూతురు సితారను కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సితార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు వినిపించాయి.

అయితే ఈసారి మాత్రం ఓ మూవీని కన్ఫామ్ చేస్తూ ఓ పెద్ద ప్రాజెక్ట్ ద్వారా సితార తెలుగు ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతుంది అన్న వార్త వైరల్ అవుతోంది. అది కూడా తన తండ్రి మహేశ్ నటిస్తున్న సినిమాతో కావడం సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న జక్కన్న రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రలో అది ఓ చిన్నప్పటి క్యారెక్టర్ లో సితార కనిపించబోతుందట.

ఇప్పటికే అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ప్రక్రియ పూర్తి అయిందట. త్వరలోనే దీనిపై మహేష్ బాబు అండ్ రాజమౌళి అధికారికంగా ప్రకటించబోతున్నారట. దీంతో మహేష్ బాబు తన కూతురు విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడని .. సితార ఎలాగైనా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాజ్యమేలడం ఖాయం అంటున్నారు మహేశ్ ఫ్యాన్స్.