“సమంత”.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ వ్యాధి కోలుకున్న సమంత మళ్ళీ సినిమా షూటింగ్‌లలో పాల్గొంటోంది. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సామ్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. సామ్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది ‘శాకుంతలం’.

అయినా కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి కోలుకొని మళ్ళీ బ్యాక్ టు యాక్షన్ అంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక వెబ్ సిరీస్‌లో నటుస్తుంది సామ్. హాలీవుడ్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో ఆమె నటిస్తూ బిజీగా ఉన్నారు. సామ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఈ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మళ్ళీ ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సులతో అదరగొట్టనుంది సమంత. ఈ వెబ్ సిరీస్ షూటింగ్లో సమంతకు స్వల్ప గాయాలైనట్లు వార్తలు కూడా వచ్చాయి.
హాలీవుడ్ లో ‘సిటడెల్’ సిరీస్ ని రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేశారు. మన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ ముఖ్య పత్రాలు పోషించగా స్టాన్లీ టుసీ, లెస్లీ మాన్విల్లే తదితరులు నటించారు. ఇక ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ ని రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్నారు. కాగా ఇంగ్లీష్ వెర్షన్ లో హాట్ సీన్స్ గట్టిగానే ఉన్నాయి.

ఇక ఇటీవల సమంత కూడా పాత్ర డిమాండ్ చేస్తే బోల్డ్‌గా నటించేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. అందుకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, ‘పుష్ప’ మూవీలో బన్నీతో చేసిన ఐటెం సాంగ్ ఉదాహరణ. పైగా ‘సిటడెల్’ సైతం ‘ఫ్యామిలీ మ్యాన్’ మేకర్స్ నుంచి వస్తుండడంతో ఈసారి కూడా గట్టిగానే వరుణ్ ధావన్‌తో సమంత ఇంటిమేన్ సీన్లు ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ రూమర్లను సామ్ టీమ్ ఖండించింది. ఈ సిరీస్‌లో అలాంటి సీన్లు ఏమీ లేవని స్పష్టం చేసింది.
కాగా ఈ సిరీస్ అమెజాన్ వేదికగా తరీమయింగ్ అవుతుండగా తెలుగు, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. మంచి యాక్షన్ టు సిరీస్ అదరగొడుతున్నప్పటికి తెలుగులో ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. మరి ఈ తరుణంలో సమంత అయిన ఈ సిరీస్ తో తెలుగు ఆడియన్స్ ని హ్యాప్పీ చేస్తుందా అని అంతా చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ప్రియాంక మిస్ అయిన టార్గెట్ సామ్ అందుకుంటుందా అని