భూమ్మీద మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికీ కోపం రావడం చాలా కామన్.. ఎంతటి మనిషికైనా కోపం వస్తుంది.. కోపం వచ్చినప్పుడు ఆ సమయంలో మాటలు అంటుండడం సాధారణం.. ఈ తప్పు మనమందరం చేసేస్తుంటాం… ఎంత కోపం వచ్చిన తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎదుటివారిని హర్ట్ చేయకుండా కూల్ గా నిర్ణయాలు తీసుకునే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి లిస్టులో పుష్ప సినిమాతో తన సత్తాను ఇండియా లెవల్లో చాటి పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ చేరిపోయాడు. ఎంత కోపం వచ్చిన ఎవరినీ హర్ట్ చేయకుండా కూల్ గా నిర్ణయం తీసుకుంటాడని అల్లు అర్జున్ అభిమానులు చెబుతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నారు అల్లు అర్జున్ .. ఆయన ఎంత ఎనర్జిటిక్ గా.. ఎప్పుడూ ఫుల్ జోష్ లో ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన ఈవెంట్ లోనైనా.. షూట్ లోనైనా ..వెకేషన్ లో అయినా.. బన్నీ ఉంటే ఆ సందడే వేరు. ఇలాంటి బన్నీ కి కూడా కోపం వస్తుందని చాలా తక్కువ మందికే తెలుసు. ఎప్పుడూ సరదగా ఉండే అల్లు అర్జున్ కు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి.
వాటి కారణంగానే కొన్ని కొన్ని సార్లు కోపం వస్తూ ఉంటుందట. అయితే అందరిలా కాకుండా అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ స్టైల్లో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడట. తనకి కోపం వస్తే చాలు వెంటనే ఏం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్లి ఎవ్వరు లేకుండా ఒక్కడే బెడ్ పై పడుకొని మైండ్ రిలాక్స్ చేసుకుంటాడట. కోపం కంట్రోల్ అయిన తర్వాతే రూం నుంచి బయటకు వచ్చి భార్య పిల్లలతో కాసేపు టైం గడుపుతారట. అంతేకానీ అందరిలా బయట కోపాలని ఇంట్లో భార్యపై పిల్లలపై చూపించాడట. ఇదే విషయాన్ని ఆయన ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.