Amardeep : ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనమంతా చూసాము. మొదటి వారం నుండి ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను మెప్పిస్తూ సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఎట్టకేలకు రీసెంట్ గానే ముగిసిన సంగతి మన అందరికీ తెలిసిందే . పల్లవి ప్రశాంత్ టైటిల్ ని గెలుచుకోగా, అమర్ దీప్ రన్నర్ గా మిగిలాడు. ఈ ఇద్దరి మధ్య బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి ఎన్నో సందర్భాల్లో గొడవలు జరిగాయి.

పల్లవి ప్రశాంత్ కి అండగా శివాజీ ఉండేవాడు. అమర్ మరియు ప్రశాంత్ కి మధ్య గ్యాప్ పెంచడం లో శివాజీ పాత్ర చాలా పెద్దదే. అసలు పల్లవి ప్రశాంత్ మాస్క్ బయటపడకుండా, మొదటి నుండి శివాజీ కాపాడుతూ వచ్చాడని, ఆయన వల్లే పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకునే మాట.

బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన వెంటనే అమర్ ఇచ్చిన బజ్ ఇంటర్వ్యూ లో శివాజీ మరియు ప్రశాంత్ గురించి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘దయచేసి ఈ విషయం లో పల్లవి ప్రశాంత్ కి దక్కాల్సిన క్రెడిట్ ని దక్కనివ్వండి. వాడు వాడి ఆట ఆడుకొని టైటిల్ కొట్టాడు, శివాజీ అన్న తన ఆటని ఆడుకొని బయటకి వెళ్ళాడు. తన బలం ఏంటో తెలుసుకొని, బాగా ఆటలు ఆడే ఇద్దరు కంటెస్టెంట్స్ ని తన వెంట పెట్టుకొని హౌస్ లో కొనసాగాడు ఆయన, తొక్కాల్సిన వాళ్ళని ఎక్కడ తొక్కలో అక్కడ తొక్కాడు’ అంటూ అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అదే సమయం లో శివాజీ అన్న అంటే నాకు చాలా గౌరవం ఉందని, అందుకే అన్న నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడినా పట్టించుకోలేదు అంటూ అమర్ దీప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
