Saindhav : మరో వారం రోజుల్లో మూవీ లవర్స్ కి పండగే..ఎందుకంటే తమ అభిమాన హీరోలు కొత్త సినిమాలతో సంక్రాంతి కి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈ సంక్రాంతికి కచ్చితంగా అందరికి మొదటి ఛాయస్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రమే. ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రం విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘సైంధవ్’.

ఈ సినిమా కి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో అంచనాలను పెంచుకుంటూ పోయింది. వెంకటేష్ ని ఇంత మాస్ యాంగిల్ లో చూసి చాలా కాలం అయ్యిందని, ఇది ఆయన అభిమానులకే కాకుండా యూత్ ఆడియన్స్ కి కూడా పండుగ లాగ ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా అప్పట్లో విడుదలైన గోపీచంద్ ఫ్లాప్ చిత్రానికి రీమేక్ అని ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రూమర్ తెగ ప్రచారం అవుతుంది.

ఈ చిత్రం ట్రైలర్ గమనిస్తే వెంకటేష్ కూతురు ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతుందని, 17 కోట్ల రూపాయిల విలువ చేసే ఒక ఇంజక్షన్ ని మాత్రమే ఆమె ప్రాణాలను కాపాడుతుందని, లేకపోతే ఆమె చనిపోతుంది అన్నట్టుగా ట్రైలర్ లో చూపించారు. తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం కోసం వెంకటేష్ ఆ ఇంజక్షన్ ని దక్కించుకోడానికి చేసే ప్రయత్నాలే ఈ సినిమా అని తెలుస్తుంది. అయితే గతం లో ఇంచుమించు ఇదే కాన్సెప్ట్ తో గోపీచంద్ హీరో గా ‘ఒక్కడున్నాడు’ అనే చిత్రం వస్తుంది. ఇందులో విలన్ గుండె మార్చకపోతే చనిపోతాడు.

తనకి సెట్ అయ్యే గుండె కోసం ఎంతో మంది రక్తాన్ని పరీక్షించి, చివరికి గోపీచంద్ గుండె తనకి సూట్ అవుతుంది అని తెలుసుకొని, అతని గుండెని దొంగిలించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్ తోనే ‘సైంధవ్’ తెరకెక్కింది. కానీ కథనం మరియు సందర్భాలు మొత్తం ‘ఒక్కడున్నాడు’ చిత్రానికి పూర్తి బిన్నంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
