Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కోసం కాళ్ళు విరగ్గొట్టుకున్న హీరో శ్రీకాంత్..అసలు ఏమి జరిగిందంటే!

- Advertisement -

Junior NTR : ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగిన శ్రీకాంత్ , ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ తో కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, శ్రీకాంత్ కోలీవుడ్, బాలీవుడ్ మరియు శాండిల్ వుడ్ లో కూడా ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ఉన్నాడు. ఒక పక్క క్యారక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే, మరోపక్క హీరో గా కూడా అప్పుడప్పుడు ఆడియన్స్ ని పలకరిస్తున్నాడు.

Junior NTR :

రీసెంట్ గా ఆయన ‘కోట బొమ్మాలి పీఎస్’ అనే చిత్రం లో హీరో గా నటించాడు. ఈ చిత్రం ఈ నెల 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా శ్రీకాంత్ నిన్న బిగ్ బాస్ హౌస్ కి విచ్చేశాడు.

ఈ సందర్భంగా ఆయన తన సినిమాని ప్రమోట్ చేసుకోవడమే కాకుండా, హౌస్ మేట్స్ తో కాసేపు సరదాగా మాట్లాడాడు కూడా. అయితే శ్రీకాంత్ కాళ్లకు దెబ్బ తగిలి ఉండడాన్ని చూసి నాగార్జున కాళ్లకు ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ‘నేను ఎన్టీఆర్ దేవర షూటింగ్ చేస్తున్నాను. రీసెంట్ గానే గోవా లో షూటింగ్ ని పూర్తి చేసుకొచ్చాము. అక్కడ సముద్రం లో నాకు ఈ దెబ్బ తగిలింది. ఆ తర్వాత వెంటనే కట్టు కట్టించుకున్నాను. ఇప్పుడు కూడా ఆ సినిమా షూటింగ్ నుండే వస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి తండ్రిగా నటిస్తున్నాడు. ఆయన పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఈ చిత్రం తో పాటుగా ఆయన రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం లో కూడా నటిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here