Anchor Lasya: యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కెరీర్లో తొలిసారిగాచీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయింది. అనంతరం లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టి అలరించింది. అప్పట్లో యాంకర్ రవి, లాస్య జోడికి మాములు రెస్పాన్స్ రాలేదు. యాంకరింగ్ లో ఎవరు తెచ్చుకోనంత గుర్తింపును ఆ జోడీ సంపాదించుకుంది అంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో ముందుగా అందరి దృష్టిని ఆకర్షించిన లాస్య తర్వాత ఆ జోరుని కొనసాగించడంలో సక్సెస్ కాలేకపోయింది. టీవీ షోల సంగతి పక్కన పెడితే.. 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్ అనే కుమారుడికి జన్మనిచ్చింది.
ఇక ఈ ఏడాది మార్చి 8న మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందింది. హోలీ పండగ రోజున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇది ఇలా ఉంటే లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన భర్త మంజునాథ్ తండ్రి మృతి చనిపోయాడు. ఈ విషయాన్ని లాస్య భర్త సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ నాన్న’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తన తండ్రి మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. మంజునాథ్. సోషల్ మీడియాలో మంజునాథ్ పెట్టిన పోస్టుకు కామెంట్ సెక్షన్ సైతం ఆఫ్ చేశారు.
View this post on Instagram