Kurchi Thatha : గత కొంతకాలంగా సోషల్ మీడియా లో టీవీ చానెల్స్ లో ‘కుర్చీ మడత పెట్టి’ అనే డైలాగ్ ఏ రేంజ్ లో వినపడుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యి, మనం దాని వాడుక భాషలో వాడుతున్నామో, ఈ ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ కూడా అదే రేంజ్ లో ఫేమస్ అయ్యింది.
ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యింది అంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు స్థాయి వ్యక్తి తన సినిమాలో ఈ డైలాగ్ ని వాడుకొని పాట చేయించుకొని డ్యాన్స్ వేసేంత అన్నమాట. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం లో ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ తో ప్రారంభం అయ్యే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ పాట మాస్ ఆడియన్స్ లో ‘గుంటూరు కారం’ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేలా చేసింది.
అయితే ఈ డైలాగ్ ఒక యూట్యూబర్ ‘కాల పాషా’ అనే అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్న సమయం లో, అతను ఒక స్టోరీ ని వివరిస్తూ మధ్యలో ‘కుర్చీ మడతపెట్టి దె**తే మెడ విరిగిపోయింది’ అంటాడు. అప్పటి నుండి ఆ డైలాగ్ ఫేమస్ అయ్యింది. ఈ డైలాగ్ ని ప్రతీ ఒక్కరు ఇష్టమొచ్చినట్టు వాడుకున్నారు కానీ, ఒక్కరు కూడా కాల పాషా కి డబ్బులు ఇవ్వలేదు. కానీ సంగీత దర్శకుడు థమన్ మాత్రం ఆయన్ని పిలుచుకొని వెళ్లి, చేతిలో లక్ష రూపాయిల చెక్ పెట్టాడు.
కానీ రీసెంట్ గా ఈయన వరంగల్ బస్సు స్టాండ్ లో బిక్షాటన చేస్తూ కనిపించాడు. అక్కడ ఎవరో 5 రూపాయిలు ఇస్తే, దాంతో అన్నం కొనుక్కొని తింటున్నాడు. ఈ వీడియో ని చూసి నెటిజెన్స్ యూట్యూబర్స్ మరియు సినీ సెలెబ్రిటీలపై మండిపడుతున్నారు. ఇన్ని రోజులు ఆయన్ని బాగా వాడుకొని, ఇప్పుడు కష్టం వస్తే ఒక్కడు సహాయం చెయ్యడం లేదని మండిపడ్డారు. అయితే రీసెంట్ థమన్ ఇచ్చిన లక్ష రూపాయిలను ఆయన ఏమి చేసాడు?, ఇంట్లో వాళ్ళు ఆయన దగ్గర నుండి ఆ చెక్ లాక్కొని బయటకి పంపేసారా, అసలు ఏమి జరిగింది అంటూ నెటిజెన్స్ ఆరాలు తీస్తున్నారు.