సుకుమార్ శిష్యుడు.. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘ఉప్పెన’. ఈ ఏడాది ఆరంభంలో అంటే ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఎంత ఘనవిజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ చిత్రంతోనే హీరోయిన్ గా పరిచయమైంది. అయితే వైష్ణవ్ కంటే ఎక్కువగా హీరోయిన్ కృతి శెట్టినే ‘ఉప్పెన’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుందని చెప్పాలి.
ఉప్పెన సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేసింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి ఈ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఏకంగా లిప్ లాక్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో చైతూతో జతకట్టింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఇలా వరుస విజయాలను అందుకొని స్టార్ గా మారిపోయింది. ఓ సినిమాలో నానికి పెట్టిన లిప్ లాక్ చూసి ఈ అమ్మడికి తాజాగా ఓ పెద్ద సినిమాలో ఆఫర్ ఇచ్చారట.
బోలెడన్ని ఆశలు పెట్టుకున్న నాగ చైతన్య కస్టడీ సినిమా కూడా బెడిసికొట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఓ క్రేజ్ అఫర్ ను పట్టేసింది తెలుస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏకంగా దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ భామ. కస్టడీ సినిమా తెరకెక్కించిన వెంకట్ ప్రభు విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టిని ఎంపిక చేశారు దర్శకుడు. దీని వెనుక ఆ లిప్ లాక్ పనిచేసిందని టాక్ వినిపిస్తోంది. కస్టడీ సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడికి మాత్రం బాగానే బాగానే కలిసొచ్చిందంటున్నారు విశ్లేషకులు.