Kriti Shetty : టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి భారీగా పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు వెల్లువలా వచ్చాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన వరసగా ఆఫర్స్ కొట్టేసింది. కానీ ఈ అమ్మడుకు అంతగా అదృష్టం కలిసి రాలేదు. మొదటిలో తనకు వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ.. అవి పరాజయాల పాలు కావడంతో తర్వాత అవకాశాలు రావడం కాస్త కష్టమైంది.
నాగచైతన్యతో చేసిన బంగార్రాజు సినిమా తప్పితే ఉప్పెన తర్వాత అమ్మడి ఖాతాలో సరైన హిట్ పడలేదు. దీంతో టాలీవుడ్‌లో కృతి శెట్టికి అవకాశాలు రావడం లేదన్న గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడు హీరో శర్వానంద్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తాజాగా వారిద్దరు కలిసి నటించిన చిత్రం మనమే. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.
అసలు మేటర్ ఏంటంటే ? కృతి శెట్టి పెళ్లి కాకుండానే తల్లి అవ్వబోతుందట. అయితే ఇది నిజ జీవితంలో కాదులేండి. ఓ సినిమాలో మాత్రమే, ఆమె నటిస్తున్న ఓ కొత్త సినిమాలో కృతిశెట్టి తల్లి క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న మనమే అనే సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి సుభద్ర అనే తల్లి పాత్రలో కనిపించనుందంట. ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌లో చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని కృతిశెట్టి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.