చైల్డ్ యాక్టర్ గా కొన్ని యాడ్స్లలో నటించిన Kriti Shetty .. మొదట డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మెగా హీరోతో నటించడంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించింది. తన మొదటి చిత్రంతోనే అందంతో అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకర్షించిన కృతి శెట్టి ఆ తర్వాత ఎన్నో వరుస విజయాలను అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈమె పలు సినిమాలలో కూడా నటిస్తూ వస్తోంది.

దీంతో టాలీవుడ్లో సినిమాలు చేస్తూనే మరొక పక్క తమిళంలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. అయితే తాజాగా కృతి శెట్టిని ఒక స్టార్ హీరో కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని తమిళ మీడియాలో వార్తలు వినిపించాయట.. తమిళంలో ఒక స్టార్ హీరో కొడుకు ఆమెను వెళుతున్న ప్రతి ఫంక్షన్ కు కూడా అటెండ్ అవుతూ ప్రతిచోటకు వెళుతూ ఆమెకు కాల్ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆమెను స్నేహితురాలుగా మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపించాయి. అయితే ఈ విషయంపై కృతి శెట్టి ఇబ్బంది పడుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు రావడం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆయా కథనాలను ఉద్దేశిస్తూ తాజాగా కృతిశెట్టి ట్వీట్ పెట్టారు. ‘‘దయచేసి ఇలాంటి కథనాలు సృష్టించి.. అసత్య ప్రచారాలు చేయడం మానండి. ఈ నిరాధారమైన వార్తలను పెద్దగా పట్టించుకోకూడదని మొదట అనుకున్నాను. అంతకంతకు ఈ ప్రచారం మరింత విస్తృతంగా మారుతోన్న తరుణంలో స్పందించక తప్పడం లేదు’’ అని ఆమె తెలిపారు. కృతిశెట్టి ట్వీట్‌తో ఆ కథనాలకు ఫుల్‌స్టాప్ పడినట్లు అయ్యింది. సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘కస్టడీ’తో అలరించిన ఈ భామ.. కెరీర్‌లో సూపర్ హిట్ కోసం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈమె ‘అజాయంతే రందం మోషణం’ అనే మలయాళం సినిమాలో నటిస్తున్నారు. దీనితోపాటు జయంరవి ‘జీని’లోనూ ఛాన్స్ కొట్టేశారు.