Kriti Sanon : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది హీరోయిన్ కృతి సనన్. ఈ సినిమా అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోవడంతో అమ్మడికి తర్వాత అవకాశాలు కరువయ్యాయి. దీంతో బ్యాక్ టు ఫెవీలియన్ అన్న చందంగా బాలీవుడ్ లోనే మాకాం వేసింది. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ క్లిక్ అయి స్టార్ డమ్ అందుకుంది. కొన్నేళ్లు తర్వాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో సీత పాత్రలో తన అద్భుతమైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక వార్తతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు కాబోయే భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే అతడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలన్న విషయాన్ని వివరించింది. ‘నాకు కోరికలు చాలా తక్కువ. ఇది కావాలి.. అది కావాలని విసిగించను. ఎందుకంటే ఇలాంటి కోరికలు ఉంటే మనం చాలా ఒత్తిడికి లోనవుతాం. మనకు కావాల్సింది నిజానికి విభిన్నంగా ఉంటుంది. నాకు అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటాను కావచ్చు. కానీ వాస్తవంలో నాకు అతడి నుంచి కేవలం సింప్లిసిటీ, నిజాయితీ మాత్రమే కావాలి. అలాగే నన్ను ఎక్కువగా నవ్వించాలి. నన్ను.. నా పనిని గౌరవించే వారితో గంటల తరబడి మాట్లాడగలను. ఇలాంటి విషయాలను అతడు గౌరవించాలి. నా ఆలోచనలతో ఎవరైన సరిగ్గా సరిపోతారని నేను భావించను. కానీ ఎల్లప్పుడు నన్ను సేఫ్ గా చూసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి సనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
కృతి రీసెంట్ గా క్రూ సినిమాలో నటించింది. ఇందులో టబు, కరీనా కపూర్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా భారీ హిట్ కావడంతో సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే కాజోల్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ దో పట్టిలో నటిస్తుంది. ఈ సినిమాతో అటు ప్రొడ్యూసర్ గానూ మారింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.