ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. ఆ వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. కెరీర్ ఆరంభంలోనే వరుసగా మూడు హిట్స్ పడడంతో కృతి శెట్టిని గోల్డెన్ లెగ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. యూత్ లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఏర్పడింది. తన సొగసులతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సునామీ సృష్టించిన ఈ బ్యూటీ… ఒక్క సినమాతోనే వరుస అవకాశాలు సాధించింది.
స్టార్ హీరోల సినిమాలననీ తన గుమ్మం ముందు ఎదురు చూసేలా చేసుకుంది బ్యూటీ అంతే కాదు.. వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి..హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా..లక్కీ స్టార్ గా మారిపోయింది. ఇక కృతి శెట్టి కెరీర్ కు ఏమాత్రం డోకా లేదు అనుకున్నారు సినీ జనాలు. కథల విషయంలో కూడా ఈ బ్యూటీ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా దక్కినట్టే అని అనుకున్నారు.

అదే సమయంలో కృతి శెట్టి తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసింది. ఉప్పెనకు రూ. 50 లక్షలు కంటే లోపే రెమ్యూనరేషన్ తీసుకున్న కృతి శెట్టి.. బంగార్రాజు తర్వాత అత్యాశకు పోయి కోటిన్నర రూపాయలు డిమాండ్ చేసింది. కథ, తన పాత్ర ప్రాధాన్యత వంటి అంశాలను పట్టించుకోకుండా.. ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే సినిమాలకు మాత్రమే సైన్ చేసిందట.
కట్ చేస్తే గత ఏడాది ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల రూపంలో వరుస ప్లాపులు పడ్డాయి. దాంతో ఎంత త్వరగా ఎదిగిందో అంతే త్వరగా పాతాళానికి పడిపోయింది. రెమ్యునరేషన్ విషయంలో అత్యాశకు పోయి కెరీర్ ను చేతులారా నాశనం చేసుకుంది. ఆ డబ్బే ఆమె కెరీర్ నాశనం చేసిందట. ప్రస్తుతం ఆఫర్లు కూడా అంతంత మాత్రంగా మరాయి.

చైతూ జోడీగా చేస్తున్న కస్టడీ తప్ప మరో సినిమాలో ఆమె ఉన్నట్టు సూచనలే లేవు. గతంలో మాదిరిగా కృతి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. రాబోయే సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వెళ్తుననట్టు కూడా కనిపించడంలేదు. దాంతో కృతి శెట్టి జోరు తగ్గినట్టే అంటున్నారు. వరుస ఫ్లాపులు పడినప్పుడు అవకాశాలు తగ్గడం .. మంచి ప్రాజెక్టు అయితేనే చేద్దాంలే అనుకుని దూకుడు తగ్గించడం సహజంగానే జరుగుతుంటాయి.
అయితే ఇలాంటి టైమ్ లో ఆమె కెరీర్ ను లైట్ తీసుకుంటే ఇక కృతి శెట్టిని మరిచిపోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు. అంతే కాదు సినిమాలు లేకపోతే హీరోలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ.. జనాలు మర్చిపోకుండా చేస్తుంటారు. కాని కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా లేదు.