Murari Re Release : మహేష్ ఫ్యాన్స్ పై విరుచుకుపడిన డైరెక్టర్ కృష్ణవంశీ..నా పరువు తియ్యొద్దు అంటూ కామెంట్స్!

- Advertisement -

Murari Re Release : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన మురారి చిత్రాన్ని 4K కి మార్చి ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి మహేష్ బాబు అభిమానులు తమ హీరో మీద ఎంత ప్రేమ ఉందో చూపించారు. ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా థియేటర్స్ కి ఒక జాతర లాగ కదిలి వచ్చారు. కొన్ని చోట్ల ప్రేమజంటలు థియేటర్స్ లోనే పెళ్లి చేసుకున్న సంఘటనలు నెటిజెన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Murari Re Release
Murari Re Release

 

ఈ వీడియోస్ ని చూసిన ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ ‘ఇది సరైన సంస్కృతి కాదు. దయచేసి ఇలాంటి పనులు చేసి మా పరువు తియ్యకండి. ఎదో మీ సంతోషం కోసం ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి హై క్వాలిటీ కి మార్చి విడుదల చేసాము, దానిని అపవిత్రం చెయ్యకండి’ అంటూ ఆయన ట్విట్టర్ లో స్పందించాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇలాంటి ట్రెండ్ ని వచ్చే నెల పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ సమయం లో ఫాలో అవ్వాలని చూసి, ఎదో ఒక విధంగా కొత్త ట్రెండ్ ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది, ఇలాంటి సంస్కృతికి తెరదించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Mahesh Babu's Murari sets a humongous re-release record | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఇదంతా పక్కన పెడితే మరోవైపు మురారి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ చిత్రానికి 5 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, రెండవ రోజు ఈ చిత్రానికి దాదాపుగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఖుషి చిత్రం రీ రిలీజ్ ఫుల్ రన్ లో దాదాపుగా 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదే ఇప్పటి వరకు ఆల్ టైం రికార్డు గా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మురారి చిత్రం ఈరోజుతో ఆ రికార్డుని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here