Krishna Vamshi : ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘హనుమాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూనే ఉంది. పెట్టిన డబ్బులకు దాదాపుగా 125 కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టింది ఈ సినిమా.

ఇన్నేళ్ల తెలుగు చలన చిత్ర చరిత్ర లో ఇప్పటి వరకు బాహుబలి సిరీస్, #RRR కి తప్ప ఈ స్థాయి లాభాలు ఏ సినిమాకి కూడా రాలేదు. చిన్న సినిమాగా విడుదలై స్టార్ హీరోల కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ మొత్తాన్ని దాటేయడం రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడే జరిగింది. అయితే ఎంత పెద్ద హిట్ సినిమాని అయినా కొంతమంది నచ్చనోళ్లు ఉంటారు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ‘హనుమాన్ ‘ చిత్రం కంటే ఒకప్పుడు విడుదలైన ‘శ్రీ ఆంజనేయం’ సినిమా బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

2004 వ సంవత్సరం లో నితిన్ హీరో గా కృష్ణవంశీ దర్శకత్వం లో ‘శ్రీ ఆంజనేయం’ అనే చిత్రం విడుదల అయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ కొంతమంది ప్రేక్షకులు చెప్పేది ఏమిటంటే, ఈ సినిమా అప్పుడు కాకుండా, ఇప్పుడు విడుదల అయ్యుంటే ‘హనుమాన్’ చిత్రం కంటే పెద్ద హిట్ అయ్యేది అని అంటున్నారు.

ఇలా సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేస్తున్న కామెంట్స్ పై కృష్ణ వంశీ మాట్లాడుతూ ‘ఆడియన్స్ ఎప్పుడూ తప్పు చెయ్యరు, వాళ్ళని అనవసరం గా నిందించకండి. నా సినిమా ఆడలేదు అంటే, కచ్చితంగా అది రీచబులిటీ లో సమస్యే. నేను కూడా ఆ సినిమా విషయం కొన్ని తప్పులు చేశాను. అందుకే ఫ్లాప్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆరోజుల్లో ఈ సినిమాలో చార్మీ చేసిన అందాల ఆరబోత వల్లే ఫ్లాప్ అయ్యిందని చాలా మంది అంటూ ఉంటారు.