Kota Srinivas Rao : తెలుగు విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. విలన్ గా, సహాయనటుడుగా, తండ్రిగా, తాతగా చేసి తెలుగు సినీ అభిమానుల మనసులో మంచి నటుడుగా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎన్నో ఏళ్ళుగా కొన్ని వందల సినిమాలతో తెలుగు, తమిళ్ తో పాటు మరిన్ని భాషల్లో నటించారు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తూ ఆడియన్స్ ను తన నటనతో మెప్పించేవాడు. ఆయన సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గానూ ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు.
ఇప్పటికి సినిమాల తోనే జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే కోట శ్రీనివాసరావు జీవితం గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. కోట శ్రీనివాసరావు విజయవాడలోని కంకిపాడులో ఉండేవారు. తండ్రీ వృత్తి రీత్యా డాక్టర్. ఇక కోట శ్రీనివాసరావు ను కూడా డాక్టర్ ను చెయ్యాలని అనుకున్నారు. కానీ ఆయన ఇష్టం లేకపోవడంతో కేవలం డిగ్రీ వరకు మాత్రం చదివి ఆపేసాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే నాటకాలు చేసేవారు. అలాగే సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతుండేవాడట.
సినిమాల్లో వరుసగా ఛాన్సులు రావడంతో ఉద్యోగంను వదిలేసినట్లు చెప్పాడు.. బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాల్లోకి వచ్చేసారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కోట శ్రీనివాసరావు చివరగా కబ్జా సినిమాలో నటించాడు. ఇక ఒకప్పుడు సినిమాలు చేయాలి ఉద్యోగం చేసుకోవాలా అన్న సందేహంలో ఉంటే.. హీరో మురళీ మోహన్ ఆయనకు సలహా ఇచ్చాడు. సినిమాలు చేసి డబ్బులు దాచుకో అని చెప్పారు. దీంతో ఈ సలహా ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు వయసు పైబడటంతో సినిమాలకు దూరంగా ఉన్నారు.