Simbhu : కోలీవుడ్ స్టార్ మీరో శింబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో నటించిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి ఇక్కడ తన మార్కెట్ తో పాటు అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. అంతేకాకుండా కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో శింబు ఒకరు. నాలుగు పదులు దాటుతున్న ఇప్పటి వరకు పెళ్లి గురించిన ప్రస్తావనే లేదు. పలువురు హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపి.. పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారు. ఇటీవలే ఆయనకు పెళ్లిపై గాలి మళ్లినట్లుంది. శింబు పెళ్లికి సిద్ధమయ్యారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.
ఆయన జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇటీవల మానాడు, వెందు తనిందదు కాడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నాడు. శింబు తన 48వ సినిమా విశ్వనటుడు కమల్ హాసన్ బ్యానర్లలో ఒకటైన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం శింబు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నార తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శింబు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. ఓ సినీ ఫైనాన్షియర్ కూతురును ఆయన పెళ్లి చేసుకోబోతున్నారట. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
శింబుకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన గతంలో నయనతార, హన్సిక, మరి కొందరు హీరోయిన్లతో లవ్వాయణం నడిపాడు. కొన్నాళ్ల పాటు శింబు నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో ఆయన కెరీర్ క్లోజ్ అనుకున్నారు. కానీ మళ్లీ మానాడు సినిమాతో హిట్ ట్రాక్ లో పడ్డారు. ప్రస్తుతం కోలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోల్లో శింబు ఒకరు. టాలీవుడ్ హీరోలతో కలిసి ఆయన మల్టీస్టారర్ సినిమాలు చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.