Kohli biopic ఈమధ్య కాలం లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో బియోపిక్స్ కి మామూలు డిమాండ్ లేదు.ముఖ్యంగా అశేష ప్రజాధారణ కల్గిన హీరోలు లేదా రాజకీయ నాయకుల, లేదా పాపులర్ క్రికెటర్స్ జీవిత చరిత్రలను సినిమాలుగా తీస్తే కమర్షియల్ గా ఒక రేంజ్ వర్కౌట్ అయ్యినవి చాలా ఉన్నాయి.ఉదాహరణకి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే.ప్రముఖ ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత కొన్ని బియోపిక్స్ వచ్చాయి కానీ సరైన ఎమోషన్స్ లేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యాయి.అయితే ఇప్పుడు ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ ని ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అయితే రీసెంట్ గా ‘ఇండియా టుడే కాంక్లేవ్’ మీటింగ్ లో పాల్గొన్న రామ్ చరణ్ ఈ బయోపిక్ పై ఆసక్తి వ్యాఖ్యలు చేసాడు.
‘క్రికెటర్స్ లో నాకు విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం.అతను ఆట తీరు అద్భుతంగా ఉంటుంది.ఆయన తన కెరీర్ లో ఎన్నో ఎత్తులను చూసాడు, అలాగే ఎన్నో ఆటుపోట్లను ఎదురుకున్నాడు, కానీ ప్రతీ సారి ఇండియా కి అవసరమైనప్పుడు బిగ్గెస్ట్ కం బ్యాక్స్ ఇచ్చాడు.ఆయన జీవితం ఎన్నో ఎమోషన్స్ తో కూడుకున్నది.ఇలాంటి లెజెండ్స్ బియోపిక్స్ ని కోట్లాది మంది ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది.అందుకే నేను విరాట్ కోహ్లీ బయోపిక్ చెయ్యడానికి ఇష్టపడతాను.నాకు ఆయనకీ ముఖ పోలికలు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఆ పాత్రకి సరిగ్గా సూట్ అవుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఒకవేళ కోహ్లీ పాత్రకి రామ్ చరణ్ సెట్ అయితే, రోహిత్ శర్మ పాత్ర కి జూనియర్ ఎన్టీఆర్ సెట్ అవుతాడు. ఇద్దరినీ పెట్టి మరోసారి మల్టీస్టార్ర్ర్ సినిమా తియ్యండి అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. మరి కోహ్లీ బయోపిక్ తియ్యడానికి ప్రయత్నం చేస్తున్న ఆ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీస్తాడా లేదా అనేది చూడాలి.