Kiraak RP : తెలుగు బుల్లితెరపై అనేక ప్రోగ్రామ్స్ ల్లో జబర్దస్త్ అనే కామెడీ షో ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు గుర్తింపు పొందారు. సుధీర్, షకలక శంకర్, గెటప్ శ్రీను,హైపర్ ఆది వంటి వాళ్లు అయితే వెండితెరపై మెరిశారు. ఇలా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో కిర్రాక్ ఆర్పీ ఒకరు. తనదైన కామెడీతో , పంచ్ లతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసేవారు. తనదైన యాసతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వారు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఆర్పీ క్రియేట్ చేసుకున్నారు. ఇలా ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. కొంతకాలం క్రితం చేపల పులుసు అనే పుడ్ బిజినెస్ ను ప్రారంభించారు. ఆర్పీ ప్రారంభించిన ఈ చేపల పులుసుకి ఫుడ్ బిజినెస్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఫేమ్ తో పాటు ఆ బిజినెస్ కి నెగెటివిటి కూడా పెరిగింది.

హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ వ్యాపారాన్ని కిర్రాక్ ఆర్పీ ప్రారంభించాడు. కూకట్ పల్లి, అమీర్‌పేట్‌లోనూ అతనికి బ్రాంచ్‌లున్నాయి. స్టాల్స్ ప్రారంభం నుంచే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్‌లను కూడా ప్రారంభించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆర్పీ తన బిజినెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ వద్ద ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆర్పీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తన వ్యాపారం, తన ధరలు ఇంతే ఉంటాయని, మిగత వాటికి తన కర్రీకి చాలా తేడా ఉంటుందని తెలిపాడు. ఆడి, బెంజ్, క్రెటా కార్లలో నీ స్తోమతను బట్టి తీసుకుంటామని, అలానే ఈ చేపల కర్రీని కూడా కొనగలిగే కెపాసిటీ ఉన్నవాళ్లే తీసుకుంటారని చెప్పుకొచ్చాడు. తన చేపల పులుసు అందుబాటు రేటులో ఉంటేనే తిను. లేకపోతే వద్దని తెలిపాడు. అయితే కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తుంటారని చెప్పుకొచ్చాడు.

ఇంకా మాట్లాడుతూ..” నీకు ఇష్టముంటే తిను. లేకపోతే లేదు. నా చేపల పులుసు రేట్లు అంతే. మా చేపల పులుసు తినమని నేను ఎవరినీ బతిమాలాడను కదా?. అలానే రేట్లు ఎంత పెట్టాలనే విషయం నాకు తెలుసు. నాది కూడా రైతు కుటుంబమే. ఎవరెన్ని చేసిన నాకు లెక్కలేదు. నా చేపల పులుసుపై నాకు నమ్మకముంది’ అని ఆర్పీ అన్నారు. అయితే అది చూసిన వారందరూ ఆర్పీ చెప్పింది నిజమేగా అందులో తప్పేముంది. దానికి ఇంత ఇష్యూ చేయాలా? ఛీ ఎందుకు రా.. తను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడే.. ఆ మట్టి కష్టమేంటో ఆర్పీకి బాగా తెలుసు.. ఊరికే నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. ఏదో పీఆర్పీకోసం ఇలా ట్రోల్ చేయాలా? అంటూ మండిపడుతున్నారు. ఆర్పీ అన్న నువ్వు సూపర్ అన్నా.. నువ్వు అన్నట్లు రేట్లు నచ్చేవాళ్లు.. నీ ఫుడ్ నచ్చిన వాళ్లు వచ్చి నీదగ్గర తింటారు.. ఇవన్నీ లైట్ తీసుకో అన్నా.. అంటూ ఆర్పీ ని కూడా ధైర్యం చెప్పడం గమనార్హం.