Kiara Advani : బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీళ్ళ పెళ్లి జరిగి ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కియారా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా ఇద్దరూ కూడా తమ తమ్ కెరీర్ తో బిజీ అయ్యారు. మ్యారేజ్ తర్వాత కూడా సినిమాలు తీస్తూ చురుకుగా ఉంటున్న ఈ జంట ఇప్పటిదాకా పిల్లల గురించి ఆలోచించలేదు. అయితే ఇప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీపై తన మనసులో మాట బయటపెట్టింది కియారా.

మరోవైపు కియారా ప్రెగ్నెంట్ అనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చివరకు అందులో నిజం లేదని తెలిసినప్పటికీ.. ప్రెగ్నెన్సీ విషయంలో కియారా చెప్పిన కొన్ని సంగతలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. నాలుగేళ్ల క్రితమే ప్రెగ్నెన్సీ విషయమై రియాక్ట్ అయింది కియారా. తనకు ప్రెగ్నెంట్ కావాలనే కోరిక చాలా రోజుల నుంచే ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2019లో ఆమె నటించిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి కామెంట్స్ చేసింది.

అందుకు కారణం కూడా చెప్పిన కియారా.. ఆ సమయంలో నచ్చింది తినొచ్చని, అడ్డు చెప్పేవారే ఉండరని చెప్పడం గమనార్హం. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా సరే కానీ ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు అంతే అని ఆమె చెప్పింది. సో.. ఫుడ్ కోసమే కియారా ఇలా ప్రెగ్నెంట్ కావాలనుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా జోడీ.. పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌ని సంబరాల్లో ముంచెత్తారు. అప్పటినుంచే కియారా ప్రెగ్నెన్సీ విషయాలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తూ టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది కియారా అద్వానీ. సినిమా సినిమాకు తన క్రేజ్ రెట్టింపయ్యేలా మేకోవర్ అవుతోంది.