Kiara Advani : ఒకప్పుడు పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ.. కానీ ఇప్పుడు ముందు ప్రెగ్నెన్సీ ఆ తర్వాత పెళ్ళంటున్నారు. బాలీవుడ్ భామలు.. ఇప్పటికే బీటౌన్ కి చెందిన కొందరు భామలు ముందు ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ కూడా పెళ్లికి ముందే తల్లైంది. ఆ తర్వాతే రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అదే లిస్టులోకి కియారా అద్వానీ కూడా చేరింది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. అమ్ముడు పెట్టిన లేటెస్ట్ పోస్టే అందుకు నిదర్శనం..
కొన్నాళ్లపాటు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేసిన కియారా అద్వానీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తారీకున సిద్ధార్థ్ తో మూడుముళ్ల బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. రాజస్థాన్ లోని జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. చిరకాల ప్రియుడు సిద్ధార్థ్ ను వివాహం చేసుకున్న కియారా ఇటీవల హనీమూన్ ట్రిప్ కి కూడా వెళ్లి వచ్చింది.
హనీమూన్ ట్రిప్ ముగిశాక కియారా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.. అదేంటంటే త్వరలోనే ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను రెడీగా ఉండండి అంటూ.. చేతిలో మామిడికాయ ముక్కలు ఉన్న ప్లేట్ పట్టుకొని కొంటెగా కవ్విస్తూ ఇస్టా స్టోరీలో పోస్ట్ షేర్ చేసింది. దాంతో పెళ్లి నెల తిరగకుండానే ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం మొదలైంది. మరి కొంతమంది పెళ్ళికి ముందే కియారా గర్భం దాల్చిందని.. ఆ తర్వాతే వివాహం చేస్తుందని చెవులు కోరుకుంటున్నారు..
కొన్నాళ్ల క్రితం కియారా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు పెళ్లై నెల తిరగకముందే సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని చెబుతోంది. కచ్చితంగా కియారా ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్ కియారా పై దండయాత్ర చేసావా ఏంటి నెల రోజుల్లోనే ప్రెగ్నెంట్ చేశావు అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు..