Kiara Advani : బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న చాలా మంది హీరోయిన్స్ తమ పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ వేరు వేరుగా చూస్తారు. అందరి దారిలోనే బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కియారా అద్వానీ కూడా అదే పని చేస్తుంది. పెళ్లయిన తర్వాత కూడా తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. తన కెరీర్ ను తనకు నచ్చినట్లు సెట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది సిద్ధార్థ్ మల్హోత్రా ను ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. పెళ్లి తన కెరీర్ కు అడ్డుగా రాకుండా ప్లాన్ చేసుకుంది.
కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తాజాగా ఈ అమ్మడు ప్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. ఫ్యాషన్ వీక్ సందర్భంగా ర్యాంప్ వాక్ తో హొయలు ఒలుకుతూ పలు రకాల ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలు చూస్తూంటే అందాల ఆరబోతలో హద్దులన్నీ కియారా అద్వానీ చెరిపేసినట్లు కనిపిస్తోంది.
ఫెమీనా మ్యాగజైన్ కోసం ఈ ఫోజలు ఇచ్చింది. అల్ట్రా స్టైలిష్ మోడల్ గా కియారా అదరగొట్టేసింది. అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. సిల్వర్ కలర్ డ్రెస్ లో ఎద అందాలతో, గ్రీన్ కలర్ వస్త్రాల్లో నడుము వంపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. కొంతమంది నెటిజన్లు పెళ్లి తర్వాత కూడా ఏంటి ఇలా రెచ్చిపోయావు.. పెళ్లయింది కదా అన్ని విప్పుకొని ఈ ఫోజులేంటి.. అంటూ కాస్త పద్ధతిగా ఉండూ అంటూ సలహాలు ఇస్తున్నారు.