Kushikapoor : జాన్వీ బాటలోనే చెల్లి ఖుషీ కపూర్.. మరీ ఆ ఫ్లాప్ హీరోతోనా ?

- Advertisement -

Kushikapoor : ప్రస్తుతం ఇదే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతూ వైరల్ అవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కొక్కరిగా తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేందుకు టాలీవుడ్ పై కన్ను వేశారని తెలుస్తోంది. వారిలో ఓ ముద్దుగుమ్మ ఇప్పటికే ఓ స్టార్ హీరో సరసన సినిమా చేస్తూనే ఉన్నారు. మరో స్టార్ హీరో సరసన నటించేంందుకు ఒకే చెప్పేశారు. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఆమె అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. తను ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రామ్ చరణ్ సరసన క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది.

అంతేకాదు పుష్ప2లో కూడా భాగం కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చెల్లి ఖుషీ కపూర్ వంతు వచ్చినట్లు తెలుస్తుంది. తనూ అక్క బాటలోనే పయనిస్తూ.. అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు పచ్చ జెండా ఊపేసిందట. ఈ సినిమా ద్వారా తెలుగులో డెబ్యూ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. బోనీకపూర్ స్టార్ వారసుల సినిమాల ద్వారానే పిల్లల్ని ఎంట్రీ ఇప్పిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఆయన తెలివితేటలను పొగిడేస్తున్నారు.

- Advertisement -

అయితే వాళ్ల కూతుర్ల పేర్లు పెద్దగా పబ్లిసిటీ దక్కించుకోవాలని ..స్టార్ వారసులు అయితే కాస్తో కూస్తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని.. మిగతా సగం మ్యాటర్ వీళ్లు తమ అందాలతో ఒప్పించేస్తారు అని .. బోనీకపూర్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడట. ఈ విషయం టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చూద్దాం మరి అఖిల్ – ఖుషి కపూర్ కాంబో ఎంతలా వర్క్ అవుట్ అవుతుందో..?.. అప్పట్లో అక్కినేని నాగార్జున – శ్రీదేవి కాంబో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్ల కాంబోపై అప్పట్లో జనాలు ఏం మాట్లాడుకున్నారో కూడా మనకు తెలిసిందే. మరి ఇప్పటి వరకు హిట్ లేని అఖిల్ .. ఖుషీ కపూర్ సినిమా ద్వారా అయిన హిట్ కొడతాడేమో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here