Keerthy Suresh : నడిరోడ్డు మీద లైంగిక వేధింపులకు గురైన కీర్తి సురేష్.. కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ కామెంట్స్!

- Advertisement -

Keerthy Suresh : ప్రస్తుతం మనం ఉంటున్న సమాజం లో ఆడపిల్లకు స్వేచ్ఛ గా రోడ్డు మీద తిరిగే స్వాతంత్య్రం పోతుంది అనిపిస్తుంది. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లలేకపోతున్నారు. అనేక ప్రాంతాలలో కొంతమంది ఆకతాయి మగవాళ్ళు చేస్తున్న అకృత్యాలకు భయపడిపోతున్నారు. ఎందుకంటే న్యూస్ పేపర్ తీస్తే ఇలాంటి వార్తలే ఎక్కువ గా కనిపిస్తున్నాయి. ఇది కేవలం సామాన్య మహిళలకు మాత్రమే కాదు. సినిమా ఇండస్ట్రీ లో సెలెబ్రిటీలుగా పిలవబడే కొంతమంది హీరోయిన్స్ జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి.

Keerthy Suresh
Keerthy Suresh

అలా తన జీవితం లో జరిగిన ఒక సంఘటన గురించి హీరోయిన్ కీర్తి సురేష్ లేటెస్ట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కీర్తి సురేష్ కి ఇలాంటి గతి పట్టిందంట ఇక మనమెంత అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

Keerthy Suresh Photos

కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘నేను కాలేజీ చదివే రోజుల్లో నా స్నేహితురాలితో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలోపు ఒక తాగుబోతు వెదవ నా చెయ్యి పట్టుకొని నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తి పోయిన నేను అతని దవడ పగిలేలా రెండు చెంపలు పగలగొట్టాను, నాకు ఎదురైనా ఈ పరిస్థితిని, నేను ఎదురుకున్న తీరుని అప్పట్లో అందరూ నన్ను తెగ మెచ్చుకున్నారు’ అంటూ కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

- Advertisement -

ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ కీర్తి సురేష్ ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అమ్మాయిలు కీర్తి సురేష్ లాగ ఉండాలని, అంత ధైర్యం గా చెంపలు వాయించే రేంజ్ లో ఉంటేనే చెడు బుద్ధి ఉన్న కొంతమంది మొగాళ్ళు బయపడతారని కామెంట్స్ చేసారు. అమ్మాయిలు ధైర్యంగా ఉన్న రోజునే మన ఇండియా లో అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోవడం తగ్గుతుంది అని అంటున్నారు నెటిజెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here