మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ కీర్తి సురేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకుంది.

‘గతంలో నేను రజనీకాంత్ సిస్టర్ పాత్రలో నటించాను. ఇప్పుడు ‘భోళాశంకర్’లో చిరంజీవి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చింది. ఇద్దరు సూపర్‌స్టార్స్‌తో నటించాను. ఓ నటిగా ఇంతకంటే నాకు ఏం కావాలి? చిరంజీవిగారితో ఒక్క ఫ్రేమ్‌లోనైనా డ్యాన్స్ చేయాలనే కోరిక ఉండేది. ఈ సినిమాతో అది తీరిపోయింది. అన్నయ్యతో సరదాగా, సంతోషంగా ఉండే చెల్లెలిగా ఈ సినిమాలో నా పాత్ర సాగుతుంది. చిరంజీవిగారితో మా అమ్మ ‘పున్నమినాగు’ చిత్రంలో నటించింది. అప్పటి చాలా విషయాలను అమ్మ నాతో చెప్పింది.

చిరంజీవిగారు సెట్‌లో నాటి రోజులను గుర్తుచేస్తూ ‘మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు. చాలా తెలివైన అమ్మాయివి’ అని మెచ్చుకున్నారు. ఆయన్ని నేను సెట్‌లో చిరుగారు అని పిలిచేదాన్ని. చిరంజీవిగారి ఇంటి నుంచే రోజూ నాకు భోజనం వచ్చేది. ఇష్టమైన వంటకాలను కోరి మరీ తెప్పించుకునేదాన్ని. దాంతో మా ఇద్దరి మధ్య భోజనం గురించిన టాపిక్స్ ఎక్కువగా వచ్చేవి (నవ్వుతూ). కెరీర్‌కు గుడ్‌బై చెప్పే లోపు అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా’ అని చెప్పింది.