Keerthy Suresh : మహానటి’ మూవీతో కీర్తి సురేష్ మరో సావిత్రి అనిపించుకుంది. ఇక అప్పటి నుంచి సౌత్ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెను సాంప్రదాయ పాత్రలో చూడడానికే ఇష్టపడుతున్నారు. ఆ ఒక్క సినిమా కీర్తి సురేష్ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసింది. ఈ సినిమాతో కీర్తికి నటిగా నేషనల్ లెవెల్ గుర్తింపు దక్కడం ప్లస్ పాయింట్ అయితే, ఇక ఆ తర్వాత ఆమెను పలకరించేవి అన్నీ అలాంటి పాత్రలే కావడం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు.
నిజానికి కీర్తితో పాటు వచ్చిన హీరోయిన్లంతా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షోతో దూసుకెళ్తున్నారు. కానీ కీర్తి సురేష్ కు మాత్రం మహానటి తెచ్చిన చిక్కుల వల్ల గ్లామర్ ఒలకబోసే అవకాశం దక్కలేదు. అయితే తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం కీర్తి సురేష్ కూడా ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ సమంత బాటలోనే నడవబోతుందట. సమంత రెండవ సినిమా నుంచి గ్లామర్ పాత్రలను చేస్తూ వచ్చింది. అయితే పెళ్లి తర్వాత పద్ధతి గల పాత్రలను ఎంచుకుంటుంది అని అనుకుంటే, ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్ లో బెడ్రూం సీన్స్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.
అలాగే ఇప్పుడు కీర్తి సురేష్ కూడా బోల్డ్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అది కూడా బాలీవుడ్ కోసం. ఇప్పటికే కీర్తి సురేష్ బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఓ హాట్ రోల్ చేయడానికి సిద్ధపడింది. త్వరలోనే బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ కూడా చేయడానికి రెడీ అయిందట. ఈ నేపథ్యంలోనే ఓ హిందీ బోల్డ్ వెబ్ సిరీస్ కు కూడా కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.